రాష్ట్రంలో సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి డిసెంబరు 14న.... లోక్ అదాలత్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాలకు పరిష్కారం చూపేందుకు ... జాతీయ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్కారు తరపున ప్రతినిధిగా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిని నియమిస్తూ…. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల నిలుపుదల, బదిలీ ఉత్తర్వుల సవాలు, పెన్షన్లు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ వంటి వేర్వేరు వివాదాలను డిసెంబరు 14న జరిగే లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈనెల 14న లోక్ అదాలత్ - పెండింగ్ కేసుల పరిష్కరానికి లోక్ అదాలత్ న్యూస్
పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి డిసెంబరు 14న లోక్ అదాలత్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సర్కారు తరపున ప్రతినిధిగా సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిని నియమించారు.
![పెండింగ్ కేసుల పరిష్కారానికి ఈనెల 14న లోక్ అదాలత్ పెండింగ్ కేసుల పరిష్కరానికి లోక్ అదాలత్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5328352-thumbnail-3x2-loc.jpg)
పెండింగ్ కేసుల పరిష్కరానికి లోక్ అదాలత్