ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: సడలింపు సమయం.. ఉదయం నుంచే రహదారులపై జనం రద్దీ - తెలంగాణ లాక్​డౌన్ 2.0

లాక్​డౌన్​ 2.0 నేపథ్యంలో రాజధానిలో గురువారం ఉదయం నుంచే రహదారులపై జనం రద్దీ నెలకొంది. లాక్‌డౌన్ సడలింపు దృష్ట్యా నగరవాసులు బయటకు వస్తోన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. నగరంలో మార్కెట్లు, దుకాణాల వద్ద బారులుతీరారు.

Telangana lockdown
తెలంగాణ లాక్​డౌన్

By

Published : May 13, 2021, 9:42 AM IST

తెలంగాణ లాక్​డౌన్

లాక్​డౌన్​ రెండో రోజు జనసమ్మర్థంగా మారింది. ఉదయం నుంచే నగర రోడ్లపై రద్దీ నెలకొంది. లాక్​డౌన్​ సడలింపులను సద్వినియోగం చేసుకునేందుకు ఒకవైపు నగరవాసులు... మరోవైపు వలస కూలీలు పోటీ పడ్డారు.

మెహదీపట్నంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కూలీలు ఎగబడ్డారు. ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు మూడింతలు, నాలుగింతలు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నగరంలో ఉండలేక, స్వస్థలాలకు వెళ్లలేక తమకు ఏంటి తిప్పలు అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details