ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మా కుమార్తె పెళ్లి.. ఇంటి నుంచే దీవించండి' - ఆదిలాబాద్​లో లాక్ డౌన్ పెళ్లి

లాక్ డౌన్.. మానవ జీవన శైలిని మార్చేసింది. విందు భోజనాలు, హంగు ఆర్భాటాలేకుండానే వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గొల్లఘట్ తాంసి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుమార్తె వివాహానికి అతిథులను ఆహ్వానించలేదు. తమ కుమార్తెను ఇంటి నుంచే దీవించాలని కోరుతూ ప్రతి ఇంటికి విందు సరకులను అందజేశారు.

lockdown marriage in adilabad district in telangana state
అతిథులు లేని పెళ్లి

By

Published : May 14, 2020, 11:42 AM IST

పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తలంబ్రాలు... విందు భోజనాలు... హంగు ఆర్భాటాలు.. పది కాలాలపాటు గుర్తుండేలా చేసుకుంటారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఆ సంబరం కనిపించకుండా పోతోంది.

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని గొల్లఘట్ తాంసి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బేబీ తాయి-రవీందర్ దంపతుల కుమార్తె వివాహం గురువారం ఉదయం జరిగింది. ఈ పెళ్లికి అతిథులను ఆహ్వానించలేదు. తమ కుమార్తె సుజాతను ఇంటి నుంచే దీవించాలని కోరుతూ గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి పెళ్లి విందుకు సంబంధించిన సరకులుు అందజేశారు.

ఇదీ చూడండి:కరోనా భయం.. తండ్రిని ఇంట్లోకి రానివ్వని కుమారులు!

ABOUT THE AUTHOR

...view details