ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు! - telangana lockdown

తెలంగాణలోని లాక్‌డౌన్‌ అమలు తొలిరోజే జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపులు ఇవ్వగా.. ఉన్న నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసేవాళ్లూ బస్సులు లేక పడిగాపులు కాశారు. నిత్యావసర దుకాణాలు కిటకిటలాడగా.. కూరగాయలు, పండ్లు చకచకా విక్రయించి వెళ్లిపోయారు.

గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు
గ్రేటర్​లో లాక్‌డౌన్‌ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు

By

Published : May 12, 2021, 7:57 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఉండగా.. వ్యాపారులు, దుకాణ దారులు షాపులు తెరిచారు. షాపింగ్ మాల్స్, వైన్ షాపులు, బహుళ వాణిజ్య సముదాయాలు ఆరింటికే తెరుచుకున్నాయి. ముందస్తు సమాచారం చేరవేసి ఉద్యోగులు పనిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రభుత్వం ఇచ్చిన అతితక్కువ గడువులోనే పనులు చక్కబెట్టుకునేందుకు మార్కెట్లకు పరగులు పెట్టారు. సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్స్ వంటి వాణిజ్య సముదాయాలకు ఉదయాన్నే చేరుకున్నారు.

వ్యాపారులపై లాక్​డౌన్​ ప్రభావం

లాక్‌డౌన్‌ ప్రభావం చిరు, వీధి వ్యాపారాలపై తీవ్రంగా పడింది. ఆరింటికే దుకాణాలు తెరిచి సరుకులు తెచ్చుకొని వాటిని పేర్చుకొనే సరికే సగం సమయం వృథా అవుతోందని వీధి వ్యాపారులు వాపోయారు. మిగిలిన రెండు గంటల్లో అరకొర కొనుగోళ్లు జరుగుతున్నాయని.. వ్యాపారం గిట్టుబాటు కావట్లేదన్నారు. స్వీట్లు, గాజులు, దుస్తుల దుకాణాల వారు ఎన్నడూ ఇంత పొద్దున్నే దుకాణాలు తెరిచింది లేదన్నారు. కొద్దిపాటి సమయంలోనే వ్యాపారం చేస్తే ఎంతో కొంత ఫలితం దక్కుతుందని ఆశించామని తెలిపారు. జనం మాత్రం ఎక్కడా ఆగకుండా 10 లోపే ఇంటికి చేరే హడావుడిలో ఉండగా.. వీధి వ్యాపారాలు అంతగా సాగలేదు.

ఆంక్షలుఉల్లంఘిస్తే.. చర్యలు

తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన గడువు పదిగంటలు సమీపిస్తుందనగానే దుకాణాలు మూసివేసి ఇళ్లకు చేరుకున్నారు. పదిగంటల తర్వాతా రోడ్డుపై ట్రాఫిక్ కాస్త తగ్గుముఖం పట్టింది. అత్యవసర, ఎమర్జెన్సీ సర్వీసులకే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తూ కీలకమైన సర్కిళ్ల వద్ద చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని నియంత్రిస్తున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలాచోట్ల అడ్డామీద కూలీలు 10 గంటల వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు.

మద్యం కొనుగోలు కోసం బారులు

కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో టిఫిన్ సెంటర్ వద్ద 10 గంటలు దాటినా జనం కనిపించారు. తనిఖీలు ప్రారంభించిన పోలీసులు తొలిరోజు అవగాహన కల్పిస్తూ ప్రజలను ఇళ్లకు వెళ్లాలని సూచించారు. షాపూర్‌నగర్‌లో బాలనగర్ డీసీపీ పద్మజా ఆధ్వర్యంలో రోడ్లపై తిరుగుతున్న ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపించారు. ఉదయం వేళల్లోనూ మద్యం దుకాణాల వద్ద అదే రద్దీ కనిపించింది. హిమాయత్‌నగర్‌లోని ఓ వైన్‌ షాప్ వద్ద మందు బాబులు మద్యం కొనుగోలుకోసం బారులు తీరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ చేపట్టారు.

ఇదీ చూడండి:

కరోనా ఉద్ధృతి: రాష్ట్రంలో మళ్లీ 20 వేలు దాటిన కేసులు

ఉచిత టీకా​ కోసం మోదీకి విపక్ష నేతల లేఖ

ABOUT THE AUTHOR

...view details