దిల్లీలో వారం రోజుల పాటు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమల్లోకి రానున్నాయి(delhi lockdown news). సోమవారం నుంచి ఏడు రోజుల పాటు పాఠశాలలు మూసివేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఇళ్ల నుంచి విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలించన్నారు(delhi lockdown news today). భవన నిర్మాణ కార్యకలాపాలు కూడా నవంబర్ 14-17 వరకు పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు.
దిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిన కారణంగా లాక్డౌన్ విధించడంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది(delhi news lockdown ). వాయునాణ్యత సూచి 499కి చేరినందున త్వరితగతిన చర్యలు చేపట్టింది. పాఠశాలలను మూసి వేస్తే పిల్లలు విషవాయువును పీల్చే ముప్పు ఉండదని కేజ్రీవాల్ అన్నారు. అయితే తరగతులను వర్చువల్గా ఆన్లైన్లో నిర్వహించాలన్నారు.
అంతకుముందు దిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది(delhi air pollution news today). వాయునాణ్యత అత్యంత తీవ్రస్థాయికి చేరడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అత్యవసర పరిస్ధితిగా అభివర్ణించింది. కాలుష్యం కట్టడికి ఈ నెల 15న అత్యవసర ప్రణాళికతో తమ ముందు హాజరుకావాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పంజాబ్‌లో రైతులు పంట వ్యర్ధాలను కాల్చడం వల్లే కాలుష్యం పెరుగుతోందని వివరించగా.. జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులపై మాత్రమే నెపం మోపడం సరికాదని, మిగతా వాటి పరిస్ధితి ఏమిటని ప్రశ్నించారు.