ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలుకు కొత్త మార్గదర్శకాలివే..!

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్​డౌన్​ నిబంధనలపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా గ్రీన్​, ఆరెంజ్​, రెడ్ జోన్లలో కొన్నింటికి సడలింపులు ఇచ్చింది. అయితే కంటెయిన్​మెంట్​ జోన్లలో మాత్రం ఆంక్షలు కఠినతరం చేసింది. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

లాక్​డౌన్​ అమలుకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలివే..!
లాక్​డౌన్​ అమలుకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలివే..!

By

Published : May 3, 2020, 11:54 PM IST

కేంద్ర నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్ అమలుకు మరికొన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తి రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ఏపీలో జిల్లాలవారీగా 3 జోన్లను ప్రకటించింది.

జోన్ల వివరాలివే...

రాష్ట్రంలో విజయనగరం జిల్లా గ్రీన్​జోన్​లో ఉండగా.. రెడ్​జోన్లలో కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఉన్నాయి. మిగిలిన ఏడు జిల్లాలను ఆరెంజ్​ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. వైరస్​ వ్యాప్తి, కాంటాక్టులు, ఇతర అంశాల ఆధారంగా కంటైన్మెంట్లు చేయాలని జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

పట్టణాల్లో వార్డు, కాలనీని, గ్రామాల్లో పంచాయతీని కంటైన్​మెంట్​గా గుర్తించాలని తెలిపింది. కంటైన్మెంట్‌ క్లస్టర్‌కు అదనంగా 500 మీటర్ల నుంచి కిలోమీటర్ ప్రాంతం బఫర్‌జోన్​గా ఉంటుందని పేర్కొంది. కంటైన్‌మెంట్‌ను మిగతా ప్రాంతాలతో వేరు చేసేలా బారికేడ్లు వేయాలని ఆదేశించింది. రిస్కు ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలపై కఠినంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది.

అనుమతి వీటికే...

రెడ్​జోన్​ గ్రీన్​ జోన్​ ఆరెంజ్​ జోన్​
ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ఔషధాలు, ఇతర నిత్యావసరాలు
అనుమతిచ్చిన కార్యకలాపాలకే ప్రైవేటు వాహనాలు అనుమతి ప్రైవేటు వాహనాలకు పూర్తి అనుమతి ట్యాక్సీ, క్యాబ్​లు(డ్రైవర్​, ఒక ప్యాసింజర్​), రిక్షాలు, అటోలు, ఆంక్షలతో ఇద్దరు ప్యాసింజర్లు
నిత్యావసరాలు అందించే ఈ-కామర్స్​ సైట్లు క్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లకు అనుమతి. నిబంధనలు తప్పనిసరి క్షౌరశాలలు, స్పాలు, సెలూన్‌లు(నిబంధనలు తప్పనిసరి)
సెజ్‌లు, ఎగుమతి, దిగుమతి యూనిట్లు షాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలు షాపింగ్​ మాల్స్​ మినహా అన్ని దుకాణాలు
నిర్మాణ రంగ కార్యకలాపాలు(పరిమితంగా) పారిశ్రామిక కార్యకరలాపాలు పారిశ్రామిక కార్యకరలాపాలు
ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిగా.. ప్రైవేటు కార్యాలయాల్లో‌ 33 శాతం సిబ్బందితో పని చేసేందుకు అనుమతి హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు) హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు)
మద్యం, పాన్​ దుకాణాలు, హోటళ్లు (స్థానికంగా అనుమతి ఉంటే తెరుచుకోవచ్చు) మద్యం, పాన్​ దుకాణాలు మద్యం, పాన్​ దుకాణాలు
వ్యవసాయ, ఉపాధి పనులు వ్యవసాయ, ఉపాధి పనులు వ్యవసాయ, ఉపాధి పనులు
  • జాతీయ రహదారుల్లో సరకు రవాణాకు అన్ని ప్రాంతాల్లోనూ అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.

వీటికి అనుమతి లేదు

  • థియేటర్లు, మాల్స్, దేవాలయాలు, ఇతర ధార్మిక ప్రదేశాలు
  • క్రీడా, రాజకీయ, సామాజిక సమావేశాలు, విద్యాసంస్థలు
  • కంటైన్మెంట్ ప్రాంతాల్లో హోటళ్లు
  • రైళ్లు, బస్సులు, విమానాలు, ప్రజా రవాణాపై నిషేధం
  • ప్రస్తుతం జిల్లాల మధ్య ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రవాణాకు అనుమతి లేదని స్పష్టం
  • రాత్రి 7 నుంచి ఉదయం 4 గంటల మధ్య ప్రజలు బయట తిరిగేందుకు వీల్లేదని సర్కారు తెలిపింది. రెడ్​జోన్​ జిల్లాలో పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

కంటెయిన్​మెంట్​​ జోన్లలో

కంటైన్మెంట్​ జోన్లలో నిబంధనలు కఠినం చేసింది ప్రభుత్వం. మాల్స్, మార్కెట్ కాంప్లెక్స్​లు, మార్కెట్లకు ఈ జోన్లలో అనుమతి లేదు. మద్యం, పాన్​ దుకాణాలకు అనుమతి నిరాకరించింది. అయితే వ్యవసాయం, ఉపాధి పనులను చేసుకోవచ్చని.. పారిశ్రామిక, నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రైవేటు కార్యాలయాలకు ఈ జోన్లలో అనుమతి లేదని పేర్కొంది.

ఇదీ చూడండి..

జేఈఈ, నీట్​పై మే 5న కేంద్రం కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details