రేపటినుంచి.. తెలంగాణలో 10 రోజులు లాక్ డౌన్ - telangana lockdown
14:23 May 11
పది రోజుల పాటు లాక్‌డౌన్ విధింపునకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపటి నుంచి ఇది అమల్లోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తెలంగాణలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్ విధించేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్.. ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి 10 వరకు కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా... కొవిడ్ టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలిచేందుకు మంత్రిమండలి నిర్ణయించింది.
ఇదీ చదవండి: