గుంటూరు గ్రామీణ ప్రాంతంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్ అమలును కట్టుదిట్టం చేస్తున్నామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. మండలాల మధ్య రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర వైద్యం అవసరమైన వారికి పాసులు ఇస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ప్రమాదకరంగా దాటేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్ మరింత పక్కాగా అమలు - ఏపీలో లాక్‌డౌన్ మరింత పటిష్ఠం
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రెడ్‌జోన్ పరిధిలో చర్యలను అత్యంత కఠినతరం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
కృష్ణా జిల్లాలో లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వెల్లడించారు. మరింత పకడ్బందీ చర్యల కోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సైతం ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. కరోనా కట్టడి దిశగా విశాఖ పారిశ్రామిక ప్రాంతం గాజువాక పరిసరాల్లో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా శాంతిభద్రతల డీసీపీ ఉదయ్ భాస్కర్ బిల్లా తెలిపారు.
ఇవీ చదవండి:ఒక్క రోజే 75 కేసులు.. పాజిటివ్ కేసుల్లో దేశంలో 9వ స్థానం