ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్ డౌన్ నుంచి మినహాయింపు.. వారికి మాత్రమే! - లాక్ డౌన్ నుంచి మినహాయింపు.. వారికి మాత్రమే

కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను పోలీసులు పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. అత్యవసర సేవలకు హాజరయ్యే వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారు.

ap dgp
ap dgp

By

Published : Mar 24, 2020, 10:46 AM IST

Updated : Mar 24, 2020, 3:42 PM IST

రాష్ట్రంలో లాక్ డౌన్ ను సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒక్కరు మాత్రమే ప్రయాణం చేసేందుకు.. కార్లలో అయితే ఇద్దరికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ఇవాళ పనిచేస్తున్నందున... సిబ్బంది, న్యాయవాదులకు, పీపీలకు సడలింపు ఇచ్చామన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించవచ్చని తెలిపారు. కోర్టుకు వెళ్లే సిబ్బంది... గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు.

రహదారుల మూసివేత

ఏపీకి వచ్చే అన్ని రహదారులను పూర్తిగా మూసివేస్తున్నామని డీజీపీ తెలిపారు. రాత్రి నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వాహనాలను అనుమతించట్లేదని పేర్కొన్నారు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రహదారుల మూసివేత కారణంగా ప్రజలెవరూ రాకపోకలు కొనసాగించరాదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

కూతురితో తండ్రికి తలకొరివి పెట్టించిన 'కరోనా'!

Last Updated : Mar 24, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details