కరోనా ప్రభావం.. సందడి లేని గోదారి తీరం.. - భద్రాచలం గోదావరి వార్తలు
కరోనా వ్యాప్తికి విధించిన లాక్డౌన్ ప్రభావం భద్రాచలం గోదావరి నదీ తీరంపై పడింది. నిత్యం సందడిగా కనిపించే గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది.
lock-down-effect-on-godavari-river-bank-in-bhadrachalam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి తీరం జనసంచారం లేక కళావిహీనంగా మారింది. ఇక్కడి చిరు వ్యాపారుల దుకాణాలు మూతపడ్డాయి. పితృ కార్యాలతో పాటు ఇతర పూజలు చెయ్యించే వాళ్లు రాలేకపోతున్నారు. గోదావరి నీటిమట్టం 3.5 అడుగులకు పడిపోవడం వల్ల ఈ నదినే జీవనాధారం చేసుకున్న జాలర్లకు చేపల వేట సాగడం లేదు.