ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్‌డౌన్‌ సడలింపులో అదనపు మార్గదర్శకాలు - ఏపీ లాక్​డౌన్ సడలింపులు

లాక్‌డౌన్‌ సడలింపులో అదనపు మార్గదర్శకాలు
లాక్‌డౌన్‌ సడలింపులో అదనపు మార్గదర్శకాలు

By

Published : Apr 29, 2020, 4:24 PM IST

Updated : Apr 29, 2020, 5:21 PM IST

16:19 April 29

కొత్త మార్గదర్శకాలు

లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం  అదనపు మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదనపు మార్గదర్శకాలు విడుదలచేసింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో అమిత్ షా సూచనల మేరకు కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలోని వలస కూలీలు వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు అనుమతిఇచ్చింది. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే అనుమతులు వర్తిస్తాయని తెలిపింది. వలస కార్మికులు రాష్ట్ర పరిధిలోనే పనిచేసుకోవాలని సూచించింది.  

లాక్​డౌన్ మినహాయింపులు  

  • వ్యవసాయ రంగం, ఉద్యాన పనులు  
  • ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్‌  
  • ప్యాకింగ్, మార్కెటింగ్‌  
  • గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు
  • పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులు
  • అనుమతులతో ఈ-కామర్స్ కంపెనీలకు, వారి వాహనాలకు అనుమతి
  • ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలు  
  • ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏర్పాటు
  • మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలోని దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి


 ఇదీ చదవండి :  విశాఖలో.. వైకాపా వసూళ్ల దందా: చంద్రబాబు


 

Last Updated : Apr 29, 2020, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details