ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని గ్రామాల్లో 'అమరావతి వెలుగు' పేరుతో నిరసనలు - రాజధాని అమరావతి వార్తలు

రాజధాని గ్రామాల్లో 333వ రోజు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అమరావతి వెలుగు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నీరుకొండలో 333ప్రమిదలు వెలిగించి నిరసన తెలిపారు.

amaravati
amaravati
author img

By

Published : Nov 15, 2020, 4:13 AM IST

రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళల నిరసన దీపావళి

రాజధాని గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసన దీక్షల వద్ద దీపాలు వెలిగించి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఉద్యమం ప్రారంభించి 333రోజులైన సందర్భంగా అమరావతి వెలుగు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్లూరు, మందడం, ఉద్ధండరాయునిపాలెం, నీరుకొండ, బోరుపాలెం, వెంకటపాలెం, అబ్బరాజు పాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాల వద్ద నిరసన తెలియజేశారు. కృష్ణాయపాలెంలో రైతులు కాగడాలతో మానవహారం నిర్వహించారు. నీరుకొండలో 333ప్రమిదలు వెలిగించి నిరసన తెలిపారు. బోరుపాలెంలో 333 కొవ్వొత్తులు వెలిగించారు. మందడం, ఉద్ధండరాయునిపాలెంలో మహిళలు మోకాళ్లపై నిల్చోని ఉద్యమ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details