పలు జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 10 జిల్లాల్లో ఎంపీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు మినహా 10 జిల్లాల్లో జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. పశ్చిమగోదావరి, గుంటూరు మినహా 11 జిల్లాల్లో ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రామాలవారీగా రిజర్వేషన్ల వివరాలు sec.ap.gov.in వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగరపాలక రిజర్వేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షుల స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా కొలిక్కి కాలేదు. రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పూర్తిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
స్థానిక పోరు: రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్‌లు విడుదల
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు వెలువడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పాలనాధికారులు గెజిట్‌లు విడుదల చేస్తున్నారు. పలు జిల్లాల కలెక్టర్లు పంపిన గెజిట్‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది.
స్థానిక పోరు: రిజర్వేషన్లు ఖరారు చేస్తూ గెజిట్‌లు విడుదల
Last Updated : Mar 6, 2020, 1:20 PM IST