ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్

స్థానిక సమరంలో తొలి అంకానికి తెరలేవబోతోంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇవాళ ప్రకటన జారీ చేయనుంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలేవీ ఎన్నికలు ఆపగలిగే స్థాయిలో లేవన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌.... విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పదో తరగతి పరీక్షలు వచ్చే నెలకు వాయిదా వేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించారు.

local-body-election-in-ap
local-body-election-in-ap

By

Published : Mar 6, 2020, 7:51 PM IST

Updated : Mar 7, 2020, 3:01 AM IST

వివరాలు వెల్లడిస్తోన్న ఎన్నికల కమిషనర్​ రమేష్​కుమార్​

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమాయాత్తమైంది. నెలలోపే ఎన్నికలు పూర్తిచేయాలని పట్టుదలతో ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో ఖరారు చేసిన రిజర్వేషన్లను ఆమోదించిన ఈసీ ఇవాళ ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అవేవీ ఎన్నికలు ఆపగలిగే స్థాయి అభ్యంతరాలుగా కనిపించలేదని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ స్పష్టంచేశారు. ఎన్నికలు సజావుగా జరిపేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అభ్యర్థులు ఇప్పటికే తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటవుతాయని, తీసుకోని వారికి త్వరితగతిన జారీ చేసేలా మీసేవ ఉన్నతాధికారులకు ఆదేశాలిస్తామని చెప్పారు. ఎన్నికల సభలు, సమావేశాల అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ తీసుకువస్తామన్నారు. ఈవీఎంలు ఎవరూ అడగనందున బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

ఎన్నికల నిర్వహణకు సరిపడా ప్రభుత్వ సిబ్బంది ఉన్నారని, వాలంటీర్లను వాడుకోవాల్సిన అవసరం రాదని కమిషనర్‌ అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాలో లోపాలను పరిశీలిస్తామన్న ఆయన.. ఒకరికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నా ఒకటికి మించి ఒటేసే అవకాశం లేదన్నారు. పదో తరగతి పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక గ్రామ సచివాలయాలకు వైకాపా రంగులు తొలగించే విషయమై నిర్ణయం తీసుకుంటానని రమేశ్‌ చెప్పారు.

Last Updated : Mar 7, 2020, 3:01 AM IST

ABOUT THE AUTHOR

...view details