ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LIVE VIDEO: శంషాబాద్​ ఓఆర్​ఆర్​పై కారు దగ్ధం.. - car burnt on shamshabad orr

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ ఓఆర్​ఆర్​పై ప్రమాదం చోటుచేసుకుంది. ఓఆర్​ఆర్​ మీదుగా గచ్చిబౌలి వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో చిక్కుకున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

car burnt
ఓఆర్​ఆర్​పై కారు దగ్ధం

By

Published : Jul 22, 2021, 3:44 PM IST

ఓఆర్​ఆర్​పై కారు దగ్ధం వీడియో..

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై కారు దగ్ధమైంది. గచ్చిబౌలి వెళ్తున్న కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ కాలనీ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి దిగేందుకు ప్రయత్నించిన వ్యక్తి మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్ గమనించి బాధితుడిని బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

మంటల్లో కాలిన వ్యక్తిని తిమ్మాపూర్‌ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details