పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఎన్‌వోసీ తీసుకుని సమస్య పరిష్కరించాలని భాజపా నేత గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగా లేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. క్వారంటైన్‌కు వెళ్లే అవసరం లేదంటే వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపింది. వారిని హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రానికి వచ్చేవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలి: హైకోర్టు - పొరుగురాష్ట్రాల నుంచి వచ్చేవారిపై హైకోర్టులో వ్యాజ్యం
పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చేవారిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్‌వోసీ ఉన్నవారికి సరిహద్దులో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు.. ఆరోగ్యం బాగాలేకుంటే క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
hicourt
TAGGED:
hicourt