తెలంగాణ.. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో విక్రయాల కంటే 40శాతం అధికంగా జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రోజుకు వంద కోట్లకు మించి అమ్మకాలు జరుగుతున్నాయి. 2019 నవంబరు 29 వరకు రూ.2,239 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అదే సమయంలో రూ.2,567 కోట్ల మద్యం అమ్మడైంది. గతేడాదితో పోల్చితే దాదాపు రూ.500 కోట్ల విలువైన మద్యం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. …
నవంబరు 17 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో రూ.154 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. రంగారెడ్డి జిల్లాలో 317, మేడ్చల్ జిల్లాలో రూ. 42 కోట్లు, మెదక్ జిల్లాలో రూ.100 కోట్ల లెక్కన మొత్తం రూ.615 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.