ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..! - amaravathi news

కరోనా సమయంలోనూ లిక్కరు కిక్కుకోసం మందుబాబులు పరితపిస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ తమపని తాము చేసుకుపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు రూ.53.33 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణ పరిస్థితులతో పోలిస్తే మద్యం అమ్మకాలు స్వల్పంగానే తగ్గాయి.

liquor sales in covid times
కరోనా కాలంలోనూ చుక్క పడాల్సిందే

By

Published : May 18, 2021, 8:21 AM IST

కరోనా కష్టకాలంలోనూ మందుబాబులు జోరు తగ్గించట్లేదు. రోజుకు సగటున రూ. 53.33 కోట్ల విలువైన మద్యం తాగేస్తున్నారు. ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నందున.. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఆ కొద్ది వ్యవధిలోనే పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే మాత్రం మద్యం విక్రయాల విలువ 17.18 శాతం మేర తగ్గింది. ప్రధానంగా బీర్ల విక్రయాలు గణనీయంగా పడిపోవటం దీనికి ప్రధాన కారణం.

  • ఏప్రిల్‌ నెల మొత్తంలో రూ.1,934 కోట్ల విలువైన మద్యాన్ని రాష్ట్రంలోని బార్లు, మద్యం దుకాణాల్లో విక్రయించారు. రోజుకు సగటున రూ.64.46 కోట్ల విలువైన మద్యం అమ్ముడయ్యేది.
  • ఈ నెల 1-4 మధ్య కర్ఫ్యూ లేని సమయంలో కూడా రోజుకు సగటున రూ.62.5 కోట్ల మేర విక్రయాలు జరిగేవి.
  • ఈ నెల 5 నుంచి కర్ఫ్యూ మొదలైంది. అప్పటి నుంచి 16 వరకూ రూ. 640 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఈ లెక్కన రోజుకు సగటున 53.33 కోట్ల విలువైన మద్యం లాగించేశారు.
  • సాధారణ పరిస్థితుల్లో రోజుకు 73 వేల కేసుల మద్యం అమ్ముడయ్యేది. ఇప్పుడు 59 వేల కేసుల అమ్ముడవుతున్నాయి. బీర్లు గతంలో రోజుకు 34 వేల కేసులు విక్రయించేవారు. ఇప్పుడది 13 వేల కేసులకు తగ్గింది.
  • బార్లలో గతంలో రోజుకు సగటున రూ.12 కోట్ల విలువైన విక్రయాలు జరిగేవి. ఆ విలువ ఇప్పుడు రూ.3 కోట్లకు పడిపోయింది. సాధారణంగా బార్లలో మధ్యాహ్నం తర్వాత నుంచే రద్దీ మొదలవుతుంది. అది రాత్రి వరకూ కొనసాగుతుంది. కానీ కర్ఫ్యూ నేపథ్యంలో మధ్యాహ్నానికే బార్లు మూసేయాల్సి రావటంతో అక్కడ విక్రయాలు పెద్దగా లేవు. మద్యం దుకాణాల వద్ద జరుగుతున్న విక్రయాల్లో మాత్రం పెద్దగా మార్పులేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details