ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాతో ఆధార్‌ అనుసంధానం... వివరాల సమర్పణ స్వచ్ఛందమే - ఏపీలో ఆధార్​ అనుసంధానం

VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అయితే ఇందులో వివరాల సమర్పణ అనేది పూర్తిగా స్వచ్ఛందమేనని పేర్కొన్నారు.

Aadhaar with voter list
ఆధార్‌ అనుసంధానం

By

Published : Jul 29, 2022, 8:14 AM IST

VOTER CARD AADHAR LINK: ఓటర్ల జాబితాను ఆధార్‌తో అనుసంధానించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శ్రీకారం చుట్టింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారంతా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఎన్నికల సంఘానికి తమ ఆధార్‌ సంఖ్యను సమర్పించాలి. అయితే ఇది పూర్తి స్వచ్ఛందం. ఆధార్‌ సంఖ్య ఇవ్వకపోయినంత మాత్రాన జాబితా నుంచి పేర్లు తొలగించరు. ఓటర్ల గుర్తింపును నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నారు.

ఎలా లింక్‌ చేయాలి:ఓటర్ల జాబితాతో ఆధార్‌ సంఖ్యను లింక్‌ చేసుకునేందుకు ఎన్నికల సంఘం కొత్తగా ఫారం-6బీ దరఖాస్తును తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌, నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్లలో త్వరలో ఈ దరఖాస్తులు లభ్యమవుతాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ ద్వారా కూడా అనుసంధానించుకోవచ్చు.

ఆధార్‌ నంబరు ఇవ్వకపోతే..?:బూత్‌ స్థాయి అధికారి తన పరిధిలోని ఓటరు జాబితాలో ఉన్న వారి ఆధార్‌ నంబర్లు తీసుకునేందుకు ఇంటింటికీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు. ఆధార్‌ సంఖ్య అధికారులకు ఇవ్వాలా? వద్దా? అనేది ఓటరు ఇష్టం. ఆధార్‌ సంఖ్య ఇవ్వకుంటే దానికి బదులుగా ఫారం-6బీ దరఖాస్తులో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించొచ్చు.

సేకరించిన సమాచారం సురక్షితంగా ఉంచుతాం- ముఖేష్‌కుమార్‌ మీనా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఆధార్‌ సంఖ్య సేకరణ, నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ జన బాహుళ్యంలోకి వెళ్లదు. సేకరించిన హార్డ్‌ కాపీలను ఈఆర్‌వోల ద్వారా డబుల్‌ లాక్‌తో సురక్షితమైన కస్టడీలో ఉంచుతాం. ఓటర్ల జాబితాను ప్రదర్శించాల్సి వస్తే ఆధార్‌ నంబర్లు కనిపించకుండా చూస్తాం. ‘ఓటర్ల జాబితాలోని పేరును ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంలోకి మార్చుకునేందుకు ‘ఫారం-6’ బదులు ‘ఫారం-8’లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జాబితాలో నుంచి పేర్ల తొలగింపునకు ఫారం-7లో దరఖాస్తు చేసుకుంటే మరణ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరి. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి లేదా ఒక నియోజకవర్గంలోనే ఇతర ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవాలనుకుంటే ఫారం-8లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details