తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఓ తాటి చెట్టుపై పిడుగు పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తాటి చెట్టు కాలుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
లైవ్ వీడియో: తాటి చెట్టుపై పిడుగుపాటు - telangana news today
తెలంగాణలో ఒక్కసారిగా వర్షం కురిసింది. పలు చోట్ల పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో ఓ తాటి చెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఈ తరుణంలో తాటి చెట్టు కొమ్మలు కాలుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. చుట్టుపక్కల ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.

లైవ్ వీడియో: తాటి చెట్టుపై పిడుగుపాటు
లైవ్ వీడియో: తాటి చెట్టుపై పిడుగుపాటు
ఒక్కసారిగా పెద్ద ఎత్తున లైట్స్ వెలిగించినట్లు వెలుగులు, పెద్ద శబ్ధం వచ్చింది. ఈ క్రమంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పిడుగు పడే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.