ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాగల మూడు రోజుల్లో... తెలంగాణలో మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని​ వాతావరణ శాఖ తెలిపింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనమే కారణమని అధికారులు వెల్లడించారు.

imd weather report
రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

By

Published : Feb 17, 2021, 7:37 PM IST

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్‌, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

రేపు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్లతో కూడిన తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. ఉపరితల ద్రోణి ఈరోజు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details