ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం - తెలంగాణ వార్తలు

నిన్నటివరకు వరకు ఉక్కపోతతో సతమతమైన జనానికి కాస్త ఉపశమనం లభించింది. మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మేఘావృతమై చల్లని గాలులు వీయగా.. ఈ ఉదయం నుంచి అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

rains in hyderabad
హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

By

Published : Apr 14, 2021, 7:32 AM IST

భాగ్యనగరంలో కురుస్తున్న వర్షాలు

హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. మంగళవారం నుంచి వాతావరణం మేఘావృతమై చల్లని గాలులు వీయగా.. ఈ ఉదయం నుంచి అక్కడక్కడా చిరుజల్లులు కురుస్తున్నాయి. నగరంలో పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, అమీర్​పేట, ఎస్ఆర్​నగర్, కర్మన్​ఘాట్, చంపాపేట్, ఐఎస్ సదన్, మీర్​పేట్, సంతోష్​ నగర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, కుత్బుల్లాపూర్‌, బోరబండ, రహమత్‌నగర్‌లో ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కోఠి, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్​నగర్​, లక్ష్మారెడ్డి పాలెంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది.

హైదరాబాద్​లో అక్కడక్కడ కురుస్తున్న చిరుజల్లులు

నగరంలో కురుస్తున్న ఈ అకాల వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురుస్తాయని.. యాదాద్రి భువనగరి, ములుగు, వరంగల్, పర్వతగిరి వంటి ప్రాంతాల్లో 82 మి.మీ వరకు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో 25 నుంచి 30 మి.మీల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

నగరంలో కురుస్తున్న వర్షాలు

ఇదీ చదవండి:రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై లేఖల యుద్ధం

ABOUT THE AUTHOR

...view details