అమరావతి రైతులకు బేడీలు వేసిన ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారు రైతులని తమకు తెలియదని సస్పెన్షన్కు గురైన పోలీసులు ఉన్నతాధికారులకు నివేదించారు. కావాలని చేయలేదని, సస్పెన్షన్ పునఃపరిశీలించాలని సిబ్బంది విన్నవించారు. వారి వినతి మేరకు ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. బేడీల ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత - అమరావతి సంకెళ్ల ఘటనలో పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత
అమరావతి రైతులకు సంకెళ్ల వేసిన ఘటనలో పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బేడీల ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
రైతులకు సంకెళ్ల ఘటనలో పోలీసులపై సస్పెన్షన్ ఎత్తివేత
TAGGED:
police suspensions removed