ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 50% ప్రభుత్వ కోటా అమలుపై సమ్మతి తెలియజేయాలంటూ వర్సిటీలకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ లేఖలు రాసింది. వాటిలో కొనసాగుతున్న కోర్సులు, సీట్ల వివరాలను అందించాలని ఆదేశించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21) నుంచే సగం సీట్లలో ప్రభుత్వ కోటా కింద ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు తీసుకొస్తున్నామని, సంబంధిత కసరత్తు కొనసాగుతోందని వెల్లడించింది. ప్రభుత్వ కోటా కింద ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్ సీట్లను భర్తీ చేస్తారని, ఈ సీట్లకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయిస్తుందని పేర్కొంది.
50% కోటాపై ప్రైవేటు వర్సిటీలకు లేఖలు - ఏపీ విశ్వవిద్యాలు తాజా వార్తలు
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ .. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 50% ప్రభుత్వ కోటా అమలుపై సమ్మతి తెలియజేయాలంటూ వర్సిటీలకు లేఖలు రాసింది.
Letters to private varsities