ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వార్థ ప్రయోజనాల కోసం లేఖలు లీక్ చేస్తున్నారు..! - AP High Court Latest News

తనకు రాష్ట్ర గవర్నర్​కు మధ్య జరిగిన ప్రత్యేక (ప్రివిలేజ్) సమాచారం ఉత్తరప్రత్యుత్తురాల వివరాలు బయటకు వెల్లడికావడం (లీక్)పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని... ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యవహారంపై మధ్యంతర నివేదికను 72 గంటల్లో కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని అభ్యర్థించారు. సమాచారం లీక్ కావడంపై గవర్నర్ ముఖ్యకార్యదర్శి విచారణ జరిపించడంలో విఫలమవ్వడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్యకార్యదర్శి, సీడీఐ డైరెక్టర్​తో పాటు మంత్రులు రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. జస్టిస్ ఆర్.రఘునందన్ రావు వద్దకు ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్ వ్యక్తిగతంగా తనకు తెలిసినందున వ్యాజ్యాన్ని మరో బెంచ్​కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. విచారణ అత్యవసరం అని పిటిషనర్ తరపు న్యాయవాది కోరిన నేపథ్యంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన సూచనలు తీసుకొని.. మరో న్యాయమూర్తి వద్దకు విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

స్వార్థ ప్రయోజనాల కోసం లేఖలు లీక్ చేస్తున్నారు..!
స్వార్థ ప్రయోజనాల కోసం లేఖలు లీక్ చేస్తున్నారు..!

By

Published : Mar 21, 2021, 4:41 AM IST

స్వార్థ ప్రయోజనాల కోసం పలు లేఖల్ని బయటకు తెస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ పేర్కొన్నారు. లీక్ వ్యవహారం ఎన్నికల కమిషనర్ విధులకు తీవ్ర అవరోధం కలిగిస్తుందని, ఈ తరహా ధోరణిని అనుమతిస్తే ప్రజాస్వామ్య పాలన విధానంపై తీవ్ర పరిణామాలుంటాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోలీసుల మితిమీరడంపై ఫిర్యాదులు వచ్చాయని... స్వతంత్ర విధులు నిర్వహణతో రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా లేదని స్పష్టం చేశారు. లీక్ వ్యవహారంపై పోలీసులకు దర్యాప్తు అప్పగిస్తే ప్రయోజనం ఉండదని... లేఖలను లీక్ చేశానని నన్నే ఇరికించే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని వ్యాఖ్యానించారు.

అధికరణ 243 (బి) (3) ప్రకారం ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా గవర్నర్.. ఎన్నికల సంఘానికి సదుపాయాలు కల్పించాలి. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండటంతో సమస్యల పరిష్కారానికి గోప్యమైన లేఖల ద్వారా పలుమార్లు గవర్నర్‌ను కలిశాను. ఆ లేఖలు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య జరిగే ప్రత్యేక ఉత్తర ప్రత్యుత్తరాలు. అందులో గవర్నర్ పరిష్కరించాల్సిన అంశాలుంటాయి. వాటిని సాధారణ ప్రజానీకానికి, మీడియాకు లీక్ చేయడానికి వీల్లేదు. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని బయటకు తెస్తూనే ఉన్నారు. లీక్ కావడంపై దర్యాప్తు జరపాలని సీఎస్, గవర్నర్ ముఖ్యకార్యదర్శిని కోరా. చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారు. ఆశ్చర్యం కలిగించే రీతిలో శాసనసభ కార్యదర్శి నుంచి ఈనెల 18న ఓ లేఖను అందుకున్నా. నాకు, గవర్నర్​కు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తర విషయంలో మంత్రులు రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. లీక్ కారణంగా మంత్రులిద్దరు స్పీకర్​కు లేఖలు సమర్పించి... వారి ప్రతిష్ఠకు భంగం కలిగినట్లు అందులో పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసు పంపుతూ.. వివరణ ఇవ్వాలని, అవసరం అయితే హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.-నిమ్మగడ్డ రమేశ్​కుమార్, ఎస్​ఈసీ

మెట్టు రామిరెడ్డి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టులో వేసిన వ్యాజ్యంతో.. తాను గవర్నర్​కు ఈనెల 12న రాసిన లేఖను పొందుపరిచారని ఎస్​ఈసీ వివరించారు. కోర్టులో వేసిన ఆ లేఖ ఎక్కడ నుంచి పొందారో పేర్కొనలేదన్నారు. ఆ లేఖ ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు అదేశాలివ్వాలని హైకోర్టును కోరారని చెప్పారు. ఎన్నికల కమిషనర్​కు గవర్నర్​కు మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు ప్రత్యేకమైనవని వివరించారు. లీక్ కాకుండా రక్షించాల్సిన అవసరం ఉందని... అవి లీక్ అయితే ఎన్నికల కమిషనర్ విధులకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందని ఎస్​ఈసీ అభిప్రాయపడ్డారు. ఈ తరహా ధోరణిని అనుమతిస్తే పరిపాలన, ప్రజాస్వామ్య పాలన విధానంపై తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

లీక్​పై సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేయాలని కోరుతున్నా. పోలీసు యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. అధికార పక్షం ఆజ్ఞల మేరకు వ్యవహరిస్తోందని రాష్ట్ర పోలీసులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల మితిమీరడంపై ఎస్ఈసీకి చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కమిషనర్​గా నా స్వతంత్ర విధులు నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. మీడియాలో వచ్చిన కథనాలే సాక్ష్యాలు. నా కార్యాలయంలో సైతం ఉత్తరప్రత్యుత్తరాల గురించి తెలీదు. అవి నా వ్యక్తిగత అదుపులో ఉంటాయి. నావైపు నుంచి లీక్ అవడానికి అవకాశమే లేదు. దర్యాప్తును సీబీఐకి ఇచ్చి 12 గంటల్లో మధ్యంతర నివేదికను సమర్పించాలని ఆదేశించకపోతే నాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.' అని ఎస్​ఈసీ పిటిషనన్​లో పేర్కొన్నారు.

ఇదీ చదవండీ... 'అమరావతికి అండగా నిలిచే వాళ్లను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది'

ABOUT THE AUTHOR

...view details