ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్చి 4న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీ

దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీని మార్చి 4న నిర్వహించనున్నట్లు ఏపీ సీఎస్‌కు కేంద్ర హోంశాఖ లేఖలో తెలిపింది. ఈ సమావేశానికి ఛైర్మన్​గా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారని పేర్కొంది.

Letter from the Union Home Ministry to ap CS on the meeting of the Zonal Council of the Southern States
దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ భేటీపై ఏపీ సీఎస్‌కు కేంద్రం లేఖ

By

Published : Feb 5, 2021, 10:41 PM IST

మార్చి 4వ తేదీన నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ అదిత్యనాథ్ దాస్​కు హోమ్ శాఖ అంతర్ రాష్ట్రాల వ్యవహారాల కార్యదర్శి సంజీవ్ గుప్తా లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పాండిచ్చేరి, లక్షదీప్, అండమాన్ నికోబర్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్​లు హాజరుకానున్నారని వెల్లడించారు.

మార్చి 4 తేదీన తిరుపతిలో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చైర్మన్ హోదాలో హాజరవుతారని స్పష్టం చేశారు. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 100 మంది వీఐపీలు హాజరు కానున్నట్లు తెలిపారు. అందుకు అవసరమయ్యే భద్రత, రవాణా, ఆతిథ్యం ఏర్పాట్లను చూడాలని సీఎస్‌కు లేఖలో సూచించారు.

ఇదీ చదవండి:

' దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఇది ప్రత్యేకమైన బడ్జెట్'

ABOUT THE AUTHOR

...view details