కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు.
కృష్ణాజలాల వివాదం:నీటి వాటా తేల్చండి..కేంద్రానికి తెలంగాణ లేఖ - కృష్ణా నది తాజా వార్తలు
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
రెండో అత్యున్నత మండలి సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి హమీ మేరకు పిటిషన్ను ఉపసంహరించుకున్నట్లు అందులో పేర్కొన్నారు. పిటిషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో నదీజలాల వివాదం సెక్షన్ 3 ప్రకారం వీలైనంత త్వరగా కృష్ణా జలాల విభజన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసి పంపకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే విచారణ కొనసాగుతున్న కృష్ణా నదీజల వివాదాల రెండో ట్రైబ్యునల్కే తెలంగాణ పిటిషన్ను నివేదించాలని కోరింది.