ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో తొలి లేపాక్షి విక్రయ కేంద్రం ప్రారంభం - lepakshi showroom launched in hyderabad by ap it minister

హైదరాబాద్​లో తొలి లేపాక్షి హస్తకళల విక్రయ కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్​లో ఉత్పత్తి అయిన హస్తకళల వస్తువులను భాగ్యనగరంలో విక్రయించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్​లో తొలి లేపాక్షి విక్రయ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్​లో తొలి లేపాక్షి విక్రయ కేంద్రం ప్రారంభం

By

Published : Dec 6, 2019, 11:51 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన తొలి లేపాక్షి హస్తకళల విక్రయ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ షోరూును ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి లేపాక్షి షోరూం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. లేపాక్షి ఉత్పత్తుల అమ్మకాలను పెంచేందుకు అమోజాన్‌తో కలిసి ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. త్వరలో విజయవాడులో ఆర్టీజన్‌ విలేజీని ప్రారంభిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 16 షోరూంలు ఉన్నాయని... హైదరాబాద్‌లో 17వ షోరూమ్‌ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన హస్తకళల వస్తువులను విక్రయించనున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన కలంకారీ పెయింటింగ్‌లు, కొయ్య కళాఖండాలు, గుంటూరు జిల్లా దుర్గిలోని ఉత్పత్తి అయ్యే శిలా కళాఖండాలు, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, విశాఖ ఇలా అన్ని జిల్లాలో ఉత్పత్తి అయిన హస్తకళలను ఈ కేంద్రం నుంచి విక్రయించనున్నట్లు మంత్రి వివరించారు.

హైదరాబాద్​లో తొలి లేపాక్షి విక్రయ కేంద్రం ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details