తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలంలో... చిరుత సంచారం స్ధానికులను కలవరానికి గురి చేసింది. వాజేడుకు 5 కిలోమీటర్ల దూరంలో కొంగాల గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఓ చెట్టుపై చిరుత గ్రామస్తుల కంట పడింది. ఊరి బయటకు వెళ్లిన కొందరు యువకులకు చెట్టుమీద చిరుత కనిపించడంతో.. గ్రామంలోకి పరుగులు తీశారు. ఆ తరువాత...గ్రామస్తులంతా గుమిగూడి చప్పుడు చేయడంతో.. చిరుత అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనతో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొంగాల, దూలాపురం గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.
చెట్టుపై చిరుతపులి .. భయాందోళనలో ప్రజలు - leopard wanders in vajedu
తెలంగాణ ములుగు జిల్లా వాజేడు మండలంలో... చిరుత సంచారం స్ధానికులను కలవరానికి గురి చేసింది. వాజేడుకు 5 కిలోమీటర్ల దూరంలో కొంగాల గ్రామ పరిసరాల్లోని అటవీ ప్రాంతంలో ఈ ఉదయం ఓ చెట్టుపై చిరుత గ్రామస్తుల కంట పడింది.
CHEETA
నాలుగు నెలల క్రితం... ములుగు, భూపాలపల్లి మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో పులిసంచారం... అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు కొత్తగూడ మండల అటవీ ప్రాంతాల్లోనూ.. ములుగు మండలం పెగడపల్లి గ్రామ శివార్లలోను చిరుత సంచరించింది. ఇప్పుడు మళ్లీ కనిపించడంతో.. అంతా భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది.. చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు.
- ఇదీ చూడండి :రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈసీ
Last Updated : Feb 22, 2021, 1:37 PM IST