తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిటి గ్రామ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అర్లిటి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన రైతు ఆత్రంరామ్ కిషన్ ఉదయం వేళ ఎద్దులను పంట చేనుకు తీసుకెళ్లి పనిలో నిమగ్నమవగా చిరుత పులి వచ్చి ఓ ఎద్దుపై దాడి చేసింది. ఇది గమనించిన ఆ రైతు అడవి పందులను పారదోలేందుకు ఉపయోగించే టపాసులను చిరుతపై వేసి అది పారిపోయేలా ధైర్యం ప్రదర్శించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్ల చిరుత పశువును వదిలి పారిపోయింది. దీనితో పశువుతో పాటు తన ప్రాణాలు దక్కించుకున్నట్లు బాధిత రైతు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
చిరుతను భయపెట్టిన రైతు..!?
ఈ మధ్య కాలంలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా శివార్లలో చిరుతల సంచారం పెరిగింది. పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. పొలం పనులకు వెళ్లే రైతులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతునే ఉన్నారు. కానీ తెలంగాణలోని ఆదిలాబాద్‌లో ఓ రైతు చిరుతనే భయపెట్టాడు.
చిరుతను భయపెట్టిన రైతు..!?