తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని చెరుకు తోటలో చిరుతపులి పిల్లలు లభ్యమయ్యాయి. వాటిని గుర్తించిన చెరుకు తోట యజమాని, గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
చెరుకుతోటలో చిరుతపులి పిల్లలు.. భయందోళనలో ప్రజలు
చెరుకుతోటలో చిట్టి చిట్టి పులిపిల్లలు తిరుగుతున్నాయి. వాటిని చూసిన యాజమని, గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు.
చెరుకుతోటలో చిరుతపులి పిల్లలు.. భయందోళనలో ప్రజలు
ఈ మేరకు అధికారులు అక్కడికి చేరుకుని చిరుతపులి పిల్లలను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్‌పూర్‌తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. గొర్రెల కాపరులు పది రోజుల వరకు అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ సూచించారు. తోటలో చిరుత పులి పిల్లలు కనిపించడంతో ఆయ గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
- ఇదీ చదవండి:తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ