ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రంగారెడ్డిలో మళ్లీ చిరుత కలకలం.. ఆవు దూడను చంపి తిన్న వైనం - telangana news

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఆవు దూడను చంపి తినేసినట్లు స్థానికులు గుర్తించారు. అటవీ అధికారులు త్వరగా బంధించాలని కోరుతున్నారు.

cheetah attack
cheetah attack

By

Published : Jan 17, 2022, 12:28 PM IST

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం సృష్టించింది. పిల్లిపల్లి శివారులోని పొలంలో ఆవు దూడను పులి చంపి తినేసినట్లు స్థానికులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు. బయటకు రావాలంటే భయంగా ఉంటుందని వాపోతున్నారు. అటవీ అధికారులు చిరుతను త్వరగా బంధించాలని కోరుతున్నారు.

ఘటనాస్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులి పాదముద్రలు సేకరించారు. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details