ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిరసనలు - ap electricity news

పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి. పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి.

left-wing parties
left-wing parties

By

Published : Mar 31, 2022, 5:43 AM IST

పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు డిమాండు చేశాయి. విద్యుత్తు ఛార్జీల పెంపును నిరసిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు సీపీఎం, సీపీఐతోపాటు 8 వామపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ‘రాష్ట్ర ప్రజలపై రూ.4,300 కోట్ల విద్యుత్తు ఛార్జీల భారం మోపడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసే ఈ టారిఫ్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. 300 యూనిట్ల లోపు వినియోగించే వారంతా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినందున వారందరికీ పాత ఛార్జీలనే వర్తింప జేయాలి’ అని డిమాండు చేశాయి.

ABOUT THE AUTHOR

...view details