Left parties Comments: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ స్వాగతించారు. సీఆర్డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని న్యాయస్థానం స్పష్టం చేసిందని.. రాష్ట్ర సర్కార్ ఇకనైనా రాజధాని అభివృద్దిపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని వివాదాలకు ముఖ్యమంత్రి స్వస్తి పలకాలని హితవు పలికారు.
Left Parties: రాజధాని వివాదాలకు సీఎం స్వస్తి పలకాలి: వామపక్ష నేతలు - Left parties Comments
Left Parties on HC Judgment over CRDA: రాజధాని అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పుపై వామపక్ష పార్టీల నేతలు స్పందించారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్వాగతించారు.
Left Parties on HC Judgment over CRDA
రాజధాని అమరావతి, సీఆర్డీఏపై రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు తెలిపారు. జగన్ సర్కార్ ఇకనైనా రాజధాని వివాదాలకు ముగింపు పలకాలన్నారు. రాష్ట్ర ప్రజల ఆమోదం మేరకు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
TAGGED:
అమరావతిపై హైకోర్టు తీర్పు