ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీ సర్కార్ దేశాన్ని హోల్​సేల్​గా అమ్మేస్తోంది: నారాయణ - మోదీ సర్కారు తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వంపై వామపక్ష నాయకులు విమర్శలు చేశారు. దేశాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తోందని... సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

left parties critisize modhi govt
left parties critisize modhi govt

By

Published : Sep 16, 2021, 2:17 PM IST

మోదీ సర్కారు.. దేశాన్ని హోల్‌సేల్‌గా కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తోందని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన ఆయన..19 రాజకీయ పార్టీలతో కలిసి... 27వ తేదీన భారత్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో... దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోందని... ఇందుకు కారణమైన ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దేశాన్ని కాపాడేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు ముందుకు రావాలని కోరారు.

భారత్​ బంద్​కు జగన్ మద్దతివ్వాలి: రామకృష్ణ

ఈ నెల 27న జరిగే భారత్ బంద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

ఈ బంద్​తో దేశంలో మార్పులు సంభవించనున్నాయని అన్నారు. భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ... రామకృష్ణ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్ర ఈరోజు కడపకు చేరుకుంది. కడప పురవీధుల్లో సీపీఐ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ పాదయాత్రకి తేదేపా, కాంగ్రెస్, పార్టీలు మద్దతు పలికాయి. నెలల తరబడి దిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న ఆందోళనపై ప్రధాని స్పందించకపోవడం దారుణమని రామకృష్ణ మండిపడ్డారు.

ఇదీ చదవండి: High Court: పరిషత్‌ పోరు ఫలితాల వెల్లడికి హైకోర్టు పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details