కరోనా మహమ్మారిపై పోరు ఉధృతంగా సాగుతోంది. వినుత్న రీతిలో కళారూపాల ద్వారా పోలీసు శాఖ ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తోంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు నేతృత్వంలో ప్రజాహిత కార్యక్రమాలు సాగుతోన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన సీఐ నాగమల్లు...అన్నార్తులకు భోజనం సరఫరా చేస్తున్నారు.
కరోనాపై తెలంగాణ పోలీసుల ఒగ్గు కథ...ఆకట్టుకుంటున్న వీడియో ! - ఎల్బీ నగర్ సీఐ అంజపల్లి నాగమల్లు ఒగ్గు కథ
శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేది పోలీసులు. నేరస్థులను పట్టుకుని శిక్ష పడేలా చేయడం వారి కర్తవ్యం. అయితే నేడు పరిస్థితుల దృష్ట్యా ప్రజలకు అనేక రకాలుగా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. లాక్‌డౌన్ కొనసాగుతున్నందున ప్రజలు ఇంట్లో ఉండి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత కాల పద్దతైన ఒగ్గు కథతో కరోనా మహమ్మారి గురించి చెబుతున్నారు తెలంగాణ పోలీసులు.
కరోనాపై తెలంగాణ పోలీసుల ఒగ్గుగథ
తాజాగా తన నేతృత్వంలో పోలీసులు వీడియో రూపంలో ఒగ్గు కథ చెప్పారు. దీనికి నాగమల్లు కథా రచన, స్వర కల్పన, గానం చేశారు. ఈ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది. విధి నిర్వహణతోపాటు సామాజికంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పిస్తున్న నాగమల్లు సేవలు, కృషిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.