ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాయర్ల సమావేశం ఉద్రిక్తం: ఏపీ బార్‌ కౌన్సిల్‌ సీరియస్ - Lawyers Meeting news

న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను ఖండిస్తున్నట్లు... ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొంది.

ఏపీ బార్‌ కౌన్సిల్
ఏపీ బార్‌ కౌన్సిల్

By

Published : Apr 10, 2021, 8:04 AM IST

ఈనెల 8న ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను ఖండిస్తున్నట్లు... ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులుగా స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని తేల్చి చెప్పింది.

సంబంధితులందరూ స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బార్‌ కౌన్సిల్‌ తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొంది. బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details