ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఎన్నో అనుమానాలు.. - vamana rao couple murder case

న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐతోనే నిష్పక్షపాత విచారణ సాధ్యమని హైకోర్టు న్యాయవాదుల ఐకాస స్పష్టంచేసింది. అన్యాయాలను ఎదిరించేవారిపై దాడులకు తెగబడటం దారుణమని గళమెత్తారు. హత్యకు ఇసుక, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాతోపాటు పోలీసులే కారణమని ఆరోపించారు. లాయర్ల హత్యోందంతంపై వెంటనే స్పందించామని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

lawyer couple murder
న్యాయవాద దంపతుల హత్య

By

Published : Feb 21, 2021, 7:10 AM IST

వామన్‌రావు దంపతుల జంట హత్యల కేసులో ఎన్నో అనుమానాలున్నాయని హైకోర్టు న్యాయవాదుల ఐకాస నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత గుంజపడుగుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మధ్యాహ్నం దాడి జరిగితే కనీసం న్యాయవాదుల దంపతులను కాపాడే యత్నం చేయలేదని ఆరోపించారు. ఘటన జరిగిన కాసేపటికే 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించే క్రమంలో కనీసం రక్తస్రావాన్ని ఆపే ఎలాంటి ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఘటనాస్థలి నుంచి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి 15 కిలోమీటర్లే ఉన్నా గంట సమయం తీసుకోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. వాహనాన్ని మధ్యలో ఎవరైనా ఆపారా అనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. నిందితుల అనుచరులే ఘటనాస్థలంలో సాక్ష్యాలు చెరిపేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హత్యోందంతంపై నిష్పాక్షిక విచారణ కోసం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

లీగల్​ ఫ్యాక్షన్​ నడుస్తోంది....

మంథని నియోజకవర్గంలో పాతికేళ్లుగా రాజకీయనాయకులు, న్యాయవాదులకు మధ్య లీగల్‌ ఫ్యాక్షన్‌ నడుస్తోందని రామగుండం సీపీ సత్యనారాయణ వివరించారు. చిన్న ఘటన జరిగినా అందుకు సంబంధం లేని ఆరోపణలు చేయడం, చిన్నపాటి గొడవలనే హైకోర్టు వరకు తీసుకెళ్లడం మామూలైందన్నారు. ఇప్పుడేమో పోలీసులపై అభండాలు వేస్తున్నారని సీపీ అసహనం వ్యక్తంచేశారు. హత్యకు ముందు జరిగినట్లు చెబుతున్న ఆడియో, వీడియోలను నిజనిర్థారణ కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

నోరు మెదపని బిట్టు...

పోలీసుల అదుపులో ఉన్న బిట్టు శ్రీనివాస్‌.... విచారణలో నోరు విప్పలేదని తెలుస్తోంది. హత్యలకు ఉపయోగించిన వేటకొడవళ్లు, కారు డ్రైవర్‌లను సమకూర్చిన బిట్టు శ్రీనును రామగుండం కమిషనరేట్‌కు తరలించి ప్రశ్నించారు. దర్యాప్తు ప్రధాన పర్యవేక్షణాధికారి డీసీపీ అశోక్‌కుమార్‌, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి, సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్‌లను కరీంనగర్‌ కేంద్ర కారాగారంలోని ఏడుగురు నిందితులున్న బ్యారక్‌లోనే ఉంచారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details