రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 81,740 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,345 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు 16 మరణాలు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ నుంచి మరో 3,001 మంది బాధితులు కోలుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ ప్రభావంతో.. గుంటూరు జిల్లాలో 3, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, కర్నూలు, ప్రకాశంలో ఇద్దరు చొప్పున, విశాఖపట్నంలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,33,96,437 మంది నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 2,345 కేసులు, 16 మరణాలు - ap covid updates
రాష్ట్రంలో కొత్తగా 2,345 కరోనా కేసులు
17:15 July 16
రాష్ట్రంలో కొత్తగా 2,345 కరోనా కేసులు నమోదు..
Last Updated : Jul 16, 2021, 5:58 PM IST