తెలంగాణలో గురువారం రాత్రి 8 గంటల వరకు 57,405 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 631 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,72,123కి చేరింది. మహమ్మారి బారిన పడి మరో ఇద్దరు మృతి చెందగా... మరణాల సంఖ్య 1,467కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 802 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 2,61,830 మంది కరోనా నుంచి విముక్తి పొందారు.
తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు - తెలంగాణలో కరోనా తాజా వార్తలు
తెలంగాణలో కొత్తగా 631 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 2,72,123 మందికి చేరింది. మహమ్మారి బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు.
latest-corona
రాష్ట్రంలో ప్రస్తుతం 8,826 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 6,812 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 56,62,711కి చేరింది.
ఇదీ చదవండి:పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భాజపా ముందంజ