గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 60 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,88,959కి చేరిందని వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు - కరోనా కేసులు ఏపీ తాజా
రాష్ట్రంలో కొత్తగా 60 మంది కరోనా బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నూతనంగా నమోదైన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 8,88,959కి చేరింది.
![రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10652440-1081-10652440-1613482796395.jpg)
రాష్ట్రంలో కొత్తగా 60 కరోనా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదని తెలిపిన వైద్యారోగ్యశాఖ.. గడిచిన 24 గంటల్లో మరో 140 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్లు చెప్పింది. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8,81,181కు చేరింది. ఇప్పటివరకూ కరోనా నిర్ధరణ పరీక్షలు 1 కోటీ 35 లక్షలు దాటినట్లు తెలిపింది.
ఇదీ చదవండి:'ప్రధానికి జగన్ దొంగ లేఖలు రాస్తున్నారు'