గత 24 గంటల్లో రాష్ట్రంలో 28,254 నమూనాలను పరీక్షించగా.. 79 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 87 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటీ 32 లక్షలకు పైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,88,178 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8.79 లక్షల మందికిపైగా కోలుకున్నారని తెలిపింది. ఇప్పటి వరకు మెుత్తం 7,157 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
రాష్ట్రంలో కొత్తగా 79 మందికి కరోనా - కరోనా కేసులు
ఏపీలో కొత్తగా 79 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 87 మంది వైరస్ నుంచి కోలుకున్నట్టు వెల్లడించింది. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 8,88,178కి చేరిందని పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 79 మందికి కరోనా..