ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Laser Show in Yadadri: ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం.. మురిసిపోతున్న భక్తులు - యాదాద్రి టెంపుల్​ న్యూస్​

Laser Show in Yadadri: తెలంగాణలోని యాదాద్రిలో పొద్దంతా.. దైవారాధనలో గడిపే భక్తులకు రాత్రివేళల్లో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం పంచేలా ఆలయం ముస్తాబవుతోంది. క్షేత్ర చరిత్రను తిలకించేలా.. లేజర్‌ షోను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి కొండపై ప్రధానాలయం మాడ వీధిలో ప్రయోగాత్మక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

Laser Show in Yadadri
Laser Show in Yadadri

By

Published : Dec 25, 2021, 11:06 AM IST

Updated : Dec 25, 2021, 11:47 AM IST

Laser Show in Yadadri: ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం... మురిసిపోతున్న భక్తులు

Laser Show in Yadadri: తెలంగాణలోని యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల్లో భక్తి భావాలను పెంపొందిస్తూ.. మానసిక పునరుత్తేజానికి దోహదడేట్లు ఆలయాన్ని తీర్చిదిద్దాలన్నదే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. ఆ క్రమంలోనే యాడా, ఆలయనిర్వాహకులు ఆలయాన్ని పునర్​నిర్మిస్తున్నారు. ఆలయ గోపురాలపై క్షేత్ర చరిత్రను తిలకించేలా.. లేజర్‌ షోను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి కొండపై ప్రధానాలయం మాడ వీధిలో ప్రయోగాత్మక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​కు చెందిన ఓ సంస్థ బీటీ కన్వర్జన్స్ ద్వారా లేజర్ కిరణాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దీంతో యాదాద్రికి వచ్చే భక్తులు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయ గోపురాలపైనే గాకుండా అష్టభుజి మండప ప్రాకారాలపై వాటి విశిష్టత, ఆలయ చరిత్రను ఆకర్షణీయమైన చిత్రాలతో ప్రదర్శించనున్నారు.

లక్ష్మీ పుష్కరిణికి.. రంగుల హంగులు!

యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. కొండ కింద గండి చెరువు పరిసరాల్లో రూ.11.55 కోట్లతో 2.13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. విద్యుదీకరణ పనులు పూర్తి కావొచ్చాయి.

ఇదీ చదవండి: CHRISTMAS CELEBRATIONS: ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. విద్యుద్దీప కాంతుల్లో చర్చీలు

Last Updated : Dec 25, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details