ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

LAPTOPS : ల్యాప్​టాప్స్ కోసం విద్యార్థుల ఎదురు చూపులు - AP LATEST NEWS

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యార్దులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అమ్మఒడి పథకం కింద నగదు వద్దు అనుకున్నవారికి ల్యాప్ టాప్​లు అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను విడుదల చేసింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇచ్చే యోచనలో ఉంది. ప్రభుత్వాలు ఇచ్చే ల్యాప్​టాప్​ల కోసం విద్యార్దులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

laptops
laptops

By

Published : Jul 9, 2021, 1:53 PM IST

రాష్ట్ర ప్రభుత్వం 9 నుంచి 12 వ తరగతి వరకు ఉన్న విద్యార్ధులకు ల్యాప్​టాప్​లను పంపిణీ చేయనుంది. అమ్మఒడి పథకం కింద నగదు వద్దు అనుకున్నవారికి ల్యాప్ టాప్​లు అందిస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి జీవోను విడుదల చేసింది.

అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికే ల్యాప్ టాప్ లు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచ్‌ స్క్రీన్, విండోస్‌ 10 ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌, ఓపెన్‌ ఆఫీస్​ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. నవరత్నాల్లో భాగంగా ఈ స్కీమ్‌ను ప్రకటించారు సీఎం జగన్. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందుతుంది.

విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇవ్వనున్న కేంద్రం!

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్‌ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచిత ల్యాప్​టాప్​లు ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది.

ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో డిజిటల్‌ విద్యను అందించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.15 వేలు విలువ చేసే సాంకేతిక పరికరాలను విద్యార్థులకు అందివ్వాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లకు గానూ రూ. 60 వేల కోట్లు కేటాయించాలని 15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. ఇందులో కేంద్రం వాటాగా రూ. 36,473 కోట్లుగా పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలు భరించాలి. దీని ద్వారా 4 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది.ప్రసుతం దేశ వ్యాప్తంగా 3.75 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరారని పేర్కొంది. ఇందులో 2021-22 విద్యా సంవత్సరంలో 1.5 కోట్ల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందిస్తోంది.

ఇదీ చదవండి:

Covid cases: దేశంలో మరో 43వేల కేసులు

కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details