ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దొంగ సర్వేలతో మోసం..! - తెదేపా

'ప్రతి ఒక్కరినీ బెదిరించి రాజకీయాలు చేయాలని వైకాపా భావిస్తోంది. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. జాతీయ ఛానళ్లలో ఎన్నికల సర్వేల పేరుతో తప్పుడు ఫలితాలు ప్రచారం చేయిస్తున్నారు' - లంకా దినకర్, తెదేపా అధికార ప్రతినిధి

మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్

By

Published : Mar 23, 2019, 3:54 PM IST

మీడియా సమావేశంలో తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్
తెదేపాకు వ్యతిరేకంగా జాతీయ ఛానళ్లలో తప్పుడు ఎన్నికల సర్వేలు చేయిస్తున్నారని వైకాపానేతలపై తెదేపా అధికారి ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ప్రతి ఒక్కరినీ బెదిరించి రాజకీయాలు చేయాలని వైకాపా భావిస్తోందని ఆరోపించారు. హింసను ప్రేరేపించేలా జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలతో అన్నిరంగాల వారికి అండగా నిలిచిన తెదేపాదే ఈ ఎన్నికల్లో విజయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

ABOUT THE AUTHOR

...view details