వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణుల మూలాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని భాజాపా నేత లంకా దినకర్ అన్నారు. బీసీలు, బ్రాహ్మణుల మధ్య గొడవ సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఆస్తులు, ఆదాయాలు మాయమవుతున్నాయని చెప్పారు. జగన్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాజకీయ క్రీడను ప్రారంభించారని ధ్వజమెత్తారు. వైకాపాలోని రెండు వర్గాలు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారా? లేదా రాజీకి పోతారా? అని ప్రశ్నించారు.
'బీసీలు, బ్రాహ్మణుల మధ్య గొడవ సృష్టించేందుకే ప్రణాళిక' - వైకాపాపై లంకా దినకర్ పైర్
బీసీలు, బ్రాహ్మణుల మధ్య గొడవలు సృష్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని భాజాపా నేత లంకా దినకర్ విమర్శించారు. బ్రహ్మణుల మూలాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
lanka dinakar fires on ysrcp govt