తెలంగాణ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్‌లో చేరేందుకు 55,531 మంది ఆసక్తి చూపారు. ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ముగియగా మొత్తం 55,531 మంది హాజరయ్యారు. రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 69,116 బీటెక్ సీట్లుండగా వాటిని ఆశించేవారు 55,531 మందే! కొందరు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైనా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోరు. వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే పోటీపడే వారి సంఖ్య ఇంకొంత తగ్గవచ్చని భావిస్తున్నారు. మంగళవారం నాటికి 28,674 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఈ నెల 22 వరకు ఐచ్ఛికాలు ఇచ్చేందుకు గడువుంది.
ఈసారి 30 సీట్లకూ అనుమతి