కర్నూలులో 2017 నాటి అత్యాచార ఘటనపై సీబీఐ చేత విచారణ జరిపించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. కంటి వెలుగు మూడో దశ ప్రారంభం తర్వాత.. బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తమకు న్యాయం చేయాలంటూ వారు చేసిన విజ్ఞప్తికి స్పందించారు. కేసును సీబీఐకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఈ అంశంపై మరోసారి వివరంగా మాట్లాడుతానని, బాధిత కుటుంబాన్ని తన వద్దకు మరోసారి తీసుకురావాలని.. సీఎం కార్యాలయం సిబ్బందిని జగన్ ఆదేశించారు.
సీబీఐకి కర్నూలు యువతి అత్యాచార కేసు.. సీఎం హామీ - pawan kalyan comments on kurnool rape case news
కర్నూలులో యువతి అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నరు. సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించారు.
kurnool-rape-case-will-be-handed-over-to-the-cbi-enquiry