కర్నూల్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై నమోదైన కేసులో.. పోలీసులు నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి కర్నూలు పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్నూల్ జిల్లా ఎస్పీ ఫకీరప్ప శనివారం కేసు గురించి వివరాలు వెల్లడించారు. చంద్రబాబుకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరతామని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నందున పోలీసులు.. హైదరాబాద్కు చేరుకొని నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కరోనా వైరస్ గురించి చంద్రబాబు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారని.. న్యాయవాది సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూల్ ఒకటవ పట్టణ పీఎస్ లో చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
హైదరాబాద్కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం! - case on chandrababu in kurnool
కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై నమోదైన కేసులో పోలీసులు హైదరాబాద్కు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి వచ్చి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
police notice to ex cm chandrababu naidu
TAGGED:
case on chandrababu