ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్: బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి దూకి యువకుడి ఆత్మహత్య - బేగంపేట మెట్రో స్టేషన్‌ వద్ద యువకుడు ఆత్మహత్య

తెలంగాణలోని హైదరాబాద్ బేగంపేటలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కర్నూలు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 26 వ తేదీన మెట్రో స్టేషన్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Hyderabad: A young man committed suicide by jumping from Begumpet metro station
హైదరాబాద్: బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

By

Published : Oct 29, 2020, 4:47 PM IST

తెలంగాణలోని హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు కర్నూలు జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన మంజునాథ్‌(23)గా పోలీసులు గుర్తించారు.

ఈ నెల 26న రాత్రి 10 గంటలకు మెట్రో స్టేషన్‌పై నుంచి దూకినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. గాయపడిన మంజునాథ్‌ను ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. అతను‌ చార్టెడ్ అకౌంట్‌ కోర్స్‌ చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ప్రైవేటు వసతిగృహంలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details